గురుర్ర్బహ్మ  గురుర్విష్ణు  ర్గురుద్దేవో మహేశ్వరః

గురుసాక్షాత్ పరబ్రహ్మ  తస్త్మె శ్రీ గురువే నమః

 

 

గురువు దైవస్వరూపముగా కీర్తించబడ్డారు. మన పూర్వజన్మ సు కృతమును బట్టి మనకు గురువు మీద భక్తి కలిగి దైవముకన్నా గురువే మిన్న అనే జ్ఞానాన్ని మన కి మన పూర్వీకులు వెల్లడించారు.

 

గురువు కోపగిస్తే దైవము ఏమీ చేయలేదు. గురువు శపించినా అనుభవించాలి తప్ప మనము శాపము నుండి తప్పించుకోవడానికి, భగవంతుడిని ప్రార్దించినా ఏమీ చేయలేడు. అదే భగవంతుడికి కోపం వస్తే గురువు తప్పించ గలడు. గురుశక్తి అంత గొప్పది. .

                    

ప్రస్తుతకాల పరిస్ధితులలో మనపూర్వీకులు,పురాణాలు చెప్పినవి వమ్ము చేసి విలువలు తగ్గిపోతున్నాయివీదికి ఒకరు గురువులుగా, స్వామీజీలుగా, అవతారాలు ఎత్తుతున్న రోజుల్లో శ్లోకమునకు అర్ధము అనర్ధమైపోయింది. భేషజము, మంది మార్బలము, ఆశ్రమాలు,డబ్బు ప్రధానమైపోయి అసలు గురుభక్తి శూన్యమైపోయిందిఎక్కడో ఒకచోట జనుల కష్టాలు వినటానికి గురువు దొరకవచ్చు. కాని కల్పిత గురువు ఎవరు? అసలు గురువు ఎవరుఅని జనులు గుర్తించడానికి సరిఅయిన పరిజ్ఞానములోపించింది.

 

పూజ్య శ్రీ శాంభవీ ధనంజయ స్వామి పుట్టుకతోనే స్వామి లక్షణాలను పుణికి  పుచ్చుకుని కష్టాలలో తనను ఆశ్రయించిన  అందరిని ఉద్ధరించుచున్నట్లుగా వినికిడి

 

శ్రీ ధనంజయస్వామి దర్శనమునకు వెళ్ళిన ప్రతీవారు  స్వామివారి  ధర్మచింతన, కష్టాలుతీర్చుపద్ధతి, చూచి  తాము కోల్పోయిన ఆత్మీయుడు దొరికినట్లుగా చెప్పుచున్నారుతప్పును, తప్పని, ఒప్పును మంచిగా చెప్పి మనుషులకు మంచి నడవడిక, ధర్మచింతన నేర్పి బ్రతుకు బాటను సరిదిద్దుతున్నారు. అందరిలాగా మనుష్యులను తన చుట్టూ త్రిప్పుకొనక, నిస్వార్ధముగా వారికి కలిగిన కష్టములను విని, వాటినుండి మనుష్యులు ప్రశాంత జీవితము గడుపుటకు బాటలు వేయుచున్నారు. మనుష్యులను పలకరించు పద్ధతి, వారి కష్టాలను తీర్చు పద్ధతి జాగ్రత్తగా   చూచిన  అది  వేదప్రమాణికముగా ఉన్నట్లు అగుపించు చున్నదిఅటువంటివారి నీడన మన బ్రతుకులు ప్రశాంతముగా గడవగలవనే చింతనతో  భక్తుల కోరిక మీర  “శ్రీ  శాంభవీస్వచ్చంద సంస్ధను ఏర్పాటు చేయడమైనదిఅందులో ఒక  బాగంగా విదేశలలో ఉన్న  భక్తుల  కోరిక  మేరకు “www.Shambhavitrust.org web site” చేయటం జరిగింది. ఇవేమి  శ్రీ శాంభవీ ధనంజయ స్వామివారికి అవసరములేదుకాని భక్తులు వారి మనోధైర్యము పెంపొందించు కొనుటకు, దూరములో నున్నను  స్వామీజీ దగ్గఱ నున్నట్లు, కష్టాలు చెప్పుకున్నట్లు, కష్టాలు తీరుతున్నట్లు ఆలోచనామాత్రమై సంతుష్టులు  కావడానికి  web site  ఉపయెగపడుతుందని  మా ఆశ

 

 పూజ్యశ్రీ శాంభవీ ధనంజయ స్వామికి విదేశల  నుండి  వారి కోరికలను విన్నవించుకుంటూ వుంటారు చాలామంది,   స్వామిజీవారి  ధర్మబద్దమైన  కోరికలను,  సునాసయంగా  నెరవేర్చుతూ ఉంటారుఅదెలా సంభవమంటే  దైవసంభూతులకు, ఆదిశంకరాచార్యుల వంటి

మహానుభావులకు  అది చాలా సునాసమైన పని. కలియుగములో అది చాలా కష్టమేన

పని, కాని శ్రీ శాంభవీ ధనంజయ స్వామివారు అందరికి  “నేనున్నాను” నన్ను తలచిన వారికి నేనే తల్లి, తండ్రి, దైవం అనేరీతిలో తనదైన శైలిలో పలుకుచూ,బాధలనుండి  విముక్తి కలిగించుచున్నారు

 

web site లో పూజ్య శ్రీ శాంభవీ ధనంజయ స్వామి వారి గూర్చి వారి భక్తుల   అనుభవములనువార్తా వాహినిగా  తెలియ చేయడమవుతుందిస్వామి  వారి  వాక్కుల  ద్వారా  వెలువడిన  సూక్తులు, భక్తుల ప్రశ్నలకు సమాదానములువారుచేయు  యాగ క్రతువులు వెలువరించడం జరుగుతుంది

                   

web site ద్వారా స్వామి వారి గురించి అందరికి తెలియ జేయలనే కోరికతో   మా శాంభవీ స్వచ్ఛంద సంస్ధ చేయు చిన్న  చిన్న ప్రయత్నములు సఫలీకృతము కావాలని, దానికి పూజ్య శ్రీ శాంభవీ ధనంజయ స్వామీజీ గారి ఆశిస్సులు నిండుగా మాపై ఉండాలని, మేము ఇంకా ఇంకా ఎన్నో మంచి  మంచి కార్యక్రమములు చేయాలని మా అభిలాషదానికి మీ అండ దండ ప్రసాదించమని కోరుతూ..

 

Secretary

 

 

శాంభవీ స్వచ్ఛంద సంస్ధ శాంభవీ స్వచ్ఛంద సంస్ధ చేయు చున్నపనులు

 

1. పేదపిల్లలకి విద్యావకాశము కల్పించుట

2. గ్రామీణ ప్రాంతములలో నున్న స్కూలు 

      పిల్లలకు యూనిఫారములు

3.  వయోవృద్దులకు బట్టలు

4. ఉచిత వైద్యము, మందుల పంపిణ

     క్యాంపులు.

 

 

                     

 

 

 

One Response

Leave a Reply to admin Cancel reply

Your email address will not be published. Required fields are marked *